రియల్ ‘బాహుబలి’ని చూస్తారా ?

బాహుబలి-2 మూవీలో హీరో ప్రభాస్ ఏనుగు తొండంపైకెక్కి జంప్ చేస్తూ దాని తలపై ఒక్కసారిగా కూచున్న సీన్ కంప్యూ టరైజ్డ్ ఎఫెక్ట్ తో ” అబ్బో ” అనిపించింది. అది రీల్ అయితే ఇక్కడ ఓ రియల్ బాహుబలి ఉన్నాడు. ఇతగాడి పేరు రీనె కెసేల్లీ జూనియర్. 21 సంవత్సరాల ఈ యువకుడు అదే దృశ్యాన్ని ఎంత పర్ఫెక్ట్ గా చేశాడో చూడాల్సిందే.. నేషనల్ హంగేరియన్ సర్కస్ లో ఎనిమల్ ట్రైనర్ అయిన రీనె.. ఓ గున్న ఏనుగుతో చేసిన స్టంట్ ” వావ్ ” అనిపిస్తుంది. డేనియల్ కలెమసి అనే వ్యక్తి అప్ లోడ్ చేసి వదిలిన ఈ వీడియోని ఊపిరి బిగబట్టి చూస్తున్నారంతా.! సహజంగానే ఇది వైరల్ అయింది.