ఈ నెల 14 వ తేదీని వాలెంటైన్ డే.. ప్రేమికుల దినోత్సవాన్ని ఎప్పటిలా కాకుండా యువతీ యువకులు విభిన్నంగా జరుపుకోవాలని ఎనిమల్ వెల్ ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా సూచిస్తోంది. ఆ రోజున దేశంలోని గోప్రేమికులంAniతా ‘కౌ హగ్ డే’ ని పాటించాలని ఈ సంస్థ పిలుపునిచ్చింది. ఆవులను ప్రేమగా హగ్ చేసుకోవడం వల్ల అంతా మంచే జరుగుతుందని, ఎమోషనల్ రిచ్ నెస్’ తథ్యమని ఈ జంతు సంరక్షణ బోర్డు పేర్కొంది.
. ‘ఇలా చేయడం సంతోషాన్నిస్తుంది.. ఆరోగ్యాన్ని కూడా కలుగజేస్తుంది.. అంతరించిపోతున్న మన వైదికాచారాల నేపథ్యంలో మేమిస్తున్న ఈ పిలుపు వీటిని పునరుద్ధరిస్తుంది’ అని ఎనిమల్ వెల్ ఫేర్ బోర్డ్ ఓ స్టేట్మెంట్ లో పేర్కొంది. పాశ్చాత్య సంస్కృతి మన హెరిటేజ్ ని, మన భారతీయ కల్చర్ ని హరిస్తున్న ఈ రోజుల్లో గోపూజ, గోవుల ఆలింగనం తిరిగి ఈ అమాయక జీవులకు మనమిస్తున్న ప్రాధాన్యాన్ని తెలియజేస్తుందని వెల్లడించింది.
మూగ ప్రాణుల పట్ల తమకు ఉన్న అనుబంధాన్ని ఇలా చాటుకోవాలని గ్రామీణ ఎకానమీ, ఇండియన్ కల్చర్.. ఈ రెండూ మనకు ఆవుల్లో కనిపిస్తాయని, అందువల్ల ఫిబ్రవరి 14 వ తేదీని ‘కౌ హగ్ డే’ గా పాటించాలని ఈ సంస్థ కోరుతోంది. ‘కామధేను’,’గోమాత’ అన్న వాటి గురించి మనకు తెలుసు.. తల్లి లాంటిదే గోవు కూడా.. అందువల్లే ‘మదర్ కౌ’ ని మనం సంతోషంగా ఉంచితే మనకు కూడా సంతోషం లభిస్తుందని వివరించింది.
గోవులను ఆలింగనం చేసుకోవడం వల్ల దేహంలోకి సానుకూల శక్తి ప్రవహిస్తుందని, మానసికోల్లాసం కలుగుతుందని తెలియజేసింది. పశుగణాభివృధి, పాడి పరిశ్రమలు, ఫిషరీస్ మంత్రిత్వ శాఖ కింద గల ఎనిమల్ హజ్బెండరీ విభాగం ఈ ప్రకటననిచ్చింది.