తెలుగింటి అందాల భామ అంజలి.. టాలీవుడ్ సినిమాలతో పాటు.. తమిళ్ లోనూ తన నటన అభినయంతో మంచి గుర్తింపు తెచ్చకుంది. వెరైటీ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది ఈ భామ. అంతేకాకుండా అగ్ర హీరోల సినిమాల్లో నటిస్తూ.. తన స్థాయిని పెంచుకుంటుంది.
ప్రస్తుతం రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలో అంజలి కీలకపాత్రలో కనిపించబోతోంది. ఈ క్రమంలో హుషారుగా ఉన్న లేడీ.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తాజాగా తన పెట్ డాగ్ తో దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఆ ఫోటోలకు ట్యాగ్ చేస్తూ ‘మమ్మాస్ బాయ్’ అని రాసుకొచ్చింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ఎవరికి నచ్చినట్టు వారు కామెంట్ చేస్తున్నారు. ‘కుక్క పిల్ల కన్నా తల్లే ముద్దుగా ఉంది’ అని కామెంట్ చేశారు ఓ నెటిజన్.
కాగా ఇంతకు ముందు కూడా అంజలి హాట్ పిక్స్ షేర్ చేసి వార్తల్లో నిలిచింది. లేటెస్ట్ ఫొటోషూట్లు చేస్తూ అదరగొడుతోంది. తాజాగా పింక్ శారీలో ఓ చెట్టుకింద అందాలను ఆరబోస్తూ దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడు ఆ పిక్స్ వైరల్ అవుతున్నాయి.