టాలీవుడ్ సిని ప్రపంచంలో ఇప్పుడెక్కువగా మల్టీ స్టారర్ సినిమాలకే ఎక్కువ క్రేజీ ఉంది. అభిమానులు సైతం ఆ సినిమాలు చూసేందుకే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అలాంటి సినిమాల్లో ఓ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ ఒకటి. ఇప్పుడున్న పరిస్థితుల్లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ ముందుకు దూసుకెళ్తోంది ఈ చిత్రం.
ఈ సినిమాలో నటించిన ఎన్టీఆర్, రాం చరణ్ లు వెండితెరపైనే కాదు రియల్ లైఫ్ లోనూ క్లోజ్ ఫ్రెండ్స్. ఈ నేపథ్యంలోనే సినిమాలో వీరి బ్రదర్ హుడ్ బాగా వర్కవుట్ అయిందని అంటున్నారు సినీ విశ్లేషకులు. అయితే.. రామ్ చరణ్ బాటలో ఎన్టీఆర్ నడుస్తున్నారని అంటున్నారు.
రామ్ చరణ్ ఇటీవల అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోగా.. శనివారం హనుమాన్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ హనుమాన్ దీక్ష తీసుకోవడం అందుకు కారణంగా చెప్పుకోవచ్చంటున్నారు అభిమానులు. సినిమా ఘన విజయం సాధించిన ఆనందంలో ఈ ఇద్దరు హీరోలు దీక్షలు చేపట్టారనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. రామ్ చరణ్ తన తండ్రితో కలిసి నటించిన ‘ఆచార్య’ మూవీ ఈ నెల 29న విడుదలకు సిద్ధం అయింది. ఓ వైపు ఆచార్య ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంటూనే.. మరో వైపు RC 15 ఫిల్మ్ షూటింగ్ లోనూ రామ్ చరణ్ పాల్గొంటున్నారు. తారక్ తన నెక్స్ట్ ఫిల్మ్ ఎన్టీఆర్30 కోసం ఎదురు చూస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది.