ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న నిరనలనకు మద్దతుగా సామాజిక కార్యకర్త అన్నా హజారే తన ఆఖరి పోరాటానికి సిద్ధమవుతున్నారు.రైతుల డిమాండ్లపై కేంద్రం అంగీకరించకపోతే నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు. జనవరి నెలాఖరులోగా రైతుల ప్రతిపాదనలను ఆమోదించకపోతే.. తాను నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు. అలాగే అదే తన ఆఖరి నిరసన అవుతుందని స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని ఆయన నివాసమైన రాలేగావ్ సిద్దీ గ్రామం మీడియాతో ఈ విషయాన్ని చెప్పారు.
మూడేళ్లుగా రైతుల కోసం తాను వివిధ నిరసనలు చేపట్టానన్న హజారే.. వారి సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం ఏ చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ప్రభుత్వం చేసే వాగ్దానాలపై నమ్మకం పోయిందని.. రైతుల డిమాండ్లకు ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూస్తానని అన్నారు. కాగా నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిర్వహించిన భారత్ బంద్‌కు మద్దతుగా.. అన్నా హజారే కూడా నిరహార దీక్ష చేశారు.