వీర సింహారెడ్డి సినిమా కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల విషయంలో తీవ్ర దుమారం రేగుతున్న తరుణంలో నటుడు, నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు స్పందించారు. అక్కినేని హీరోలు ఈ వ్యాఖ్యల గురించి ఇంతలా స్పందించాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. బాలయ్య ఫ్లోలో ఆ మాట అన్నాడని అంతే తప్ప కావాలని అనలేదని ఆయన క్లారిటీ ఇచ్చారు.
తెలుగులో పర్యాయపదాలు ఎక్కువన్న ఆయన బాలయ్య మనసులో అక్కినేని ఫ్యామిలీని కించపరచాలని లేదని స్పష్టం చేసారు. బాలయ్యకు కంట్రోల్ ఉండదన్నారు చిట్టిబాబు. బాలయ్య అక్కినేని తొక్కినేని అనడం తప్పేనని అయితే బాలయ్యకు ఏఎన్నార్ కు మంచి అనుబంధం ఉందని వెల్లడించారు. ఇక బాలయ్య ఏఎన్నార్ మధ్య అనుబంధం నాగార్జునకు కూడా తెలుసని ఆయన వ్యాఖ్యానించారు.
ఏఎన్నార్ బాలయ్య ఫ్రెండ్స్ లా ఉండేవారని తెలిపిన ఆయన… సరదాగా కాలక్షేపం చేసేవారని చెప్పుకొచ్చారు. నాగ్ బాలయ్య మధ్య కంటే ఏఎన్నార్ బాలయ్య మధ్య చనువు ఎక్కువగా ఉండేదని వ్యాఖ్యానించారు. ఏఎన్నార్ తో గొడవ గురించి బాలయ్యను నేను అడిగినా చెప్పలేదని అన్నారు. బాలయ్యకు కోపం వస్తే డైరెక్ట్ గానే కామెంట్ చేస్తారని పేర్కొన్నారు. నాగార్జున కన్నా బాలయ్యతో ఏఎన్నార్ కు ఎక్కువ అనుబంధం ఉండేదనితెలిపారు. కాగా బాలయ్య కామెంట్స్ విషయంలో అక్కినేని హీరోలు ఖండించిన సంగతి తెలిసిందే.