దేశంలోని హాట్ స్పాట్ జిల్లాలో ఒకటిగా ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న అన్నవరం దేవస్థానంలో కరోనా విజృంభిస్తోంది. దేవస్థానంలో పనిచేస్తున్న దాదాపు 300మందికి పరీక్షలు చేయగా 29మందికి కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఈ నెల 14వరకు అన్నవరం దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఈవీ త్రినాథరావు అధికారికంగా ప్రకటించారు.
అయితే… స్వామి వారికి నిత్య ఆర్జిత సేవలు ఏకాంతంగా నిర్వహిస్తామని వెల్లడించారు.