రామ్ చరణ్ భార్య ఉపాసన గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఉపాసన సోదరి అనుష్పాల పెళ్లికి సన్నాహాలు మొదలయ్యాయి. గత నెలలో, అపోలో గ్రూప్స్ వైస్ ప్రెసిడెంట్ అయిన అనుష్పాల తన ప్రియుడు అథ్లెట్, రేస్ కార్ డ్రైవర్ అయిన అర్మాన్ ఇబ్రహీంతో నిశ్చితార్థం చేసుకున్నారు. కాగా తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే ఉపాసన, అనుష్పాల, అర్మాన్‌లతో కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ ఫోటో సంగీత్ సమయంలో తీసిన ఫోటో. అయితే మరోవైపు, బిగ్ బాస్ షోతో పాపులారిటీ సంపాదించిన కొరియోగ్రాఫర్ అనీ మాస్టర్ కూడా చరణ్‌తో దిగిన కొన్ని ఫోటోలు పోస్ట్ చేశారు. ఈ ఫోటోను కూడా అనుష్పల సంగీత కార్యక్రమంలో క్లిక్ చేశారు. అనుష్పల సంగీత్‌లోని డ్యాన్స్ ఈవెంట్‌లకు అనీ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేస్తున్నారు. ఈ బాధ్యతను రామ్ చరణ్ ఆమె కు అప్పగించారట. ఇదే విషయాన్ని చెబుతూ నా పని మాట్లాడుతుంది. నన్ను తిరిగి పిలిచినందుకు చరణ్‌కి ధన్యవాదాలు.