ఆ చిన్నిగుండె కోసం…పెద్దమనసు చేసుకున్నాడతను. కులం, మతం చూడలేదు. లాభమా, నష్టమా అని లెక్కలు వేయలేదు. తాను సంపాదించే డబ్బు ఓ పసివాడి ప్రాణాన్ని బతికిస్తే చాలనుకున్నాడు.
అందుకే ఆ పసిపాపకి వైద్యం చేయించాడు. ఒక రూపాయిచ్చి వంద ఫోటోలు అప్ లోడ్ చేసుకునే గొప్పోళ్ళున్న ఈ రోజుల్లో…ఒకటి కాదు రెండు కాదు 11 కోట్ల రూపాయల గుప్త దానం చేసి తన విశాల హృదయాన్ని చాటుకున్నాడు ఓ అజ్ఞాత వ్యక్తి.
విదేశాల నుంచి ఈ వ్యక్తి చేసిన రూ.11 కోట్ల దానం ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ పర్సన్‌పై నెట్టింట ప్రశంసలు గుప్పిస్తున్నారు నెటిజన్స్. వివరాల్లోకి వెళితే …
ఎర్నాకులానికి చెందిన నేవీ ఆఫీసర్ సారంగ్, అతిథిల తనయుడు నిర్వాణ్ వయసు 16 నెలలు. అయితే అతడు పుట్టినప్పుటి నుంచి కాళ్లు కదపడం లేదు.
దీంతో ఆందోన చెందిన తల్లిదండ్రులు.. ఇటీవల ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు చిన్నోడు అరుదైన స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ టైప్ 2 అనే డిసీజ్‌తో బాధ పడుతున్నట్లు వెల్లడించారు. అయితే 2 ఏళ్ల ముందు మందులు వాడితేనే ట్రీట్మెంట్ చేసేందుకు వీలవుతుందని డాక్టర్లు తెలిపారు.
అయితే ఆ మెడిసిన్‌ను అమెరికా నుంచి తెప్పించాలంటే.. రూ.17.5 కోట్లు ఖర్చవుతుంది. ప్రజంట్ చిన్నారికి 16 నెలలు. అంటే ఇంకో 8 నెలల్లోగా వైద్యం చేయించాలి. అంత ఆర్థిక స్థోమత ఆ కుటుంబానికి లేదు. దీంతో క్రౌడ్ ఫండింగ్ ప్రారంభించారు. దీంతో చిన్నోడి వైద్య చికిత్స కోసం దాతలు భారీ ఎత్తున విరాళాలు పంపడం ప్రారంభించారు.
ఈ సమయంలోనే ఓ ఫారెనర్ తన నేమ్ చెప్పకుండా 11 కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేశాడు. ఇంకో 80 లక్షలు సమకూరితే.. చిన్నోడి చికిత్సకు సరిపడా డబ్బులు వస్తాయి.
దీంతో చికిత్సకు అవసరమైన మిగిలిన డబ్బుల కోసం ఆ బాలుడి ఫ్యామిలీ ఎంతో ఆశగా ఎదురుచూస్తోంది. నిర్వాణ్ కోలుకున్న తర్వాత తమకు రూ.11 కోట్ల అధిక మొత్తంలో ఆర్థిక సాయం అందించిన వ్యక్తిని ఎలాగోలా కలిసి.. ధన్యవాదాలు చెబతామని బాబు ఫ్యామిలీ మెంబర్స్ తెలిపారు.