బెంగాల్ లో ఈడీ దాడులు సంచలనం రేపుతున్నాయి. బెంగాల్ మంత్రి పార్థ చటర్జీ సహాయకురాలు అర్పితకు చెందిన మరో ఫ్లాట్ లో ఈడీ సోదాలు చేసింది.
ఈ సోదాల్లో భారీగా డబ్బును ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రూ. 20 కోట్ల నగదును, మూడు కిలోల బంగారాన్ని ఈడీ అధికారులు పట్టుకున్నారు.
పశ్చిమ బెంగాల్ టీచర్స్ రిక్రూట్ మెంట్ స్కామ్ కు సంబంధించి ఈడీ మరోసారి దాడులు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఐదు ప్రాంతాల్లో ఏక కాలంలో దాడులు చేసినట్టు ఈడీ అధికారులు వెల్లడించారు.
బెంగాల్ లో టీచర్స్ రిక్రూట్ మెంట్ స్కామ్ కు సంబంధించి గత వారం మంత్రి సహాయకురాలు అర్పితకు చెందిన ప్లాట్ లో ఈడీ అధికారులు సోదాలు చేయగా రూ. 20 కోట్ల నగదు పట్టుబడింది. దీంతో మంత్రితో పాటు అర్పితను కూడా ఈడీ అధికారులు అరెస్టు చేశారు.