తెలుగు ప్రేక్షకులకు దసరా కానుకగా విడుదలైన మెగాస్టార్ చిత్రం గాడ్ ఫాదర్. థియేటర్లలోకి వచ్చిన మొదటి రోజు నుంచే హిట్ టాక్ సొంతం చేసుకుంది. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రం రెండు రోజుల్లోనే 69 కోట్లు వసూలు చేసింది.
మలయాళంలో మోహన్ లాల్ చేసిన ‘లూసిఫర్’ సినిమాకి ఇది అఫీషియల్ రీమేక్. తెలుగు నేటివిటీకి తగినట్టుగా మోహన్ రాజా మార్పులు చేసి ‘గాడ్ ఫాదర్’ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
చిరంజీవి చెల్లెలి పాత్రలో నయనతార, ప్రతినాయక పాత్రలో సత్యదేవ్ ఆకట్టుకున్నారు. బాలీవుడ్ బడా హీరో సల్మాన్ ఖాన్ కీలక పాత్ర పోషించారు.దీంతో ఈ మల్టీస్టారర్ సినిమాకు హిందీలో కూడా మంచి ఆదరణ లభిస్తోంది.
బాలీవుడ్‌లో సైతం ఈ చిత్రానికి తొలి మూడు రోజుల్లో మంచి స్పందన వచ్చింది. ప్రేక్షకుల స్పందన నేపథ్యంలో హిందీలో గాడ్ ఫాదర్ కి ఒక్కసారిగా 600 స్క్రీన్లు పెంచారు. ఈ విషయాన్ని చిరంజీవి వెల్లడించారు. తన చిత్రానికి ఇంత మంచి విజయం కట్టబెట్టిన ప్రేక్షకులందరికీ థ్యాంక్స్ చెబుతూ ఓ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు.
Another 600 screens added for #GodFather in Hindi 💥💥
Megastar @KChiruTweets thanks the audience for giving the HUMONGOUS BLOCKBUSTER 💥
–https://t.co/qO2RT7dqmM#BlockbusterGodfather 🔥@BeingSalmanKhan @jayam_mohanraja #Nayanthara @MusicThaman @ActorSatyaDev pic.twitter.com/R04HA1nm2c
— Konidela Pro Company (@KonidelaPro) October 8, 2022