బెల్లంకొండ శ్రీనివాస్. వరుసగా సినిమాలు చేస్తున్నా… ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో సెటిల్ అవుతున్న కథానాయకుడు. తను బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టకపోయినా, తన సినిమాలు డబ్ అవుతుండటంతో హిందీలో మంచి మార్కెట్ సంపాదించుకున్నాడు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో మంచి పేరు ఉంది.
ఇప్పుడు బెల్లంకొండ ఫ్యామిలీ నుండి మరో హీరో రాబోతున్నాడు. బెల్లంకొండ శ్రీనివాస్ బ్రదర్ బెల్లంకొండ గణేష్ ఎంట్రీకి ముహుర్తం ఖరారైంది. నిజానికి తను ఎప్పుడో ఎంట్రీ ఇవ్వాల్సింది. రెండు సినిమాలు చేసినప్పటికీ అవి అనుకోని కారణాల వల్ల విడుదలకు నోచుకోలేదు. కానీ ఇప్పుడు ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బెల్లంకొండ గణేష్ తో సినిమా చేయనుంది. ఓ డెబ్యూ డైరెక్టర్ తో ఈ మూవీ ఉండబోతుందని తెలుస్తోంది. అతి త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అధికారిక సమాచారం విడుదల కానుంది.