హిజాబ్ పిటిషన్ పై కర్ణాటక హైకోర్టు గురువారం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ డా. జే. హల్లీ ఫెడరేషన్ ఫర్ మజీద్ మద్రాసీస్, వక్ఫ్ సంస్థలు ఈ మేరకు పిటిషన్ ను దాఖలు చేశారు.
హైకోర్టు తన మధ్యంతర ఉత్తర్వుల ద్వారా ముస్లీం విద్యార్థినులను హిజాబ్ ధరించ కుండా చేయడం ద్వారా వారి ప్రాథమిక హక్కులను తగ్గించిందని, వారి చదువును కొనసాగించడంలో అడ్డంకులను కలిగించిందని పిటిషన్ లో సుప్రీం కోర్టుకు తెలిపారు.
సంబంధింత విద్యార్థులకు ఫిబ్రవరి 15 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు జరగవలసి ఉందని పిటిషన్ దారులు తెలిపారు. ఇలాంటి సమయంలో విద్యాసంస్థలకు ఆ విద్యార్థులను అడ్డుకోవడం వారి విద్యపై తీవ్ర ప్రభావం చూపుతుందని పిటిషన్ లో పేర్కొన్నారు.
హిజాబ్ ధరించడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1) ప్రసాధించిన వ్యక్తీకరణ కిందకు వస్తుంది. అంతేకాకుండా రైట్ టు ప్రైవసీ, ఫ్రీడమ్ ఆఫ్ కాన్షియన్స్ లు ఇదే విషయాన్ని చెబుతున్నాయి. వీటిని చెల్లుబాటయ్యే చట్టం లేకుండా వీటిని ఉల్లంఘించడం సరికాదని పిటిషన్ లో పేర్కొన్నారు.