హైదరాబాద్ లో మరో పరువు హత్య జరిగినట్లు తెలుస్తోంది. బేగంబజార్ మచ్చి మార్కెట్ దగ్గర నీరజ్ పన్వార్ అనే వ్యక్తిని కత్తులతో పొడిచి చంపారు దుండగులు. ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కక్షతో ఈ దాడి జరిగినట్లుగా అనుమానాలు ఉన్నాయి.
ఏడాది క్రితం నీరజ్ ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. దీంతో యువతి కుటుంబీకులు కక్షగట్టి నీరజ్ ను పొట్టన పెట్టుకున్నట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన వెంటనే స్పాట్ కు చేరుకున్నారు పోలీసులు. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఖాకీలు. నీరజ్ ను కత్తితో దాదాపు 20 సార్లు పొడిచినట్లుగా చెబుతున్నారు.
ఈమధ్యే హైదరాబాద్ సరూర్ నగర్ లో పరువు హత్య జరిగింది. ముస్లిం యువతిని పెళ్లి చేసుకున్నాడని నాగరాజు అనే వ్యక్తిని ఆమె అన్న చంపేశాడు. ‘ఫైండ్ మై డివైజ్’ యాప్ ను ఉపయోగించి హత్య చేశాడు.