బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జిల్లాల పర్యటనతో టీఆర్‌ఎస్ శ్రేణుల్లో వణుకు మొదలైందా..? రైతుల సమస్యలు అడిగేందుకు వెళ్లిన ఆయనపై దాడుల వెనుక పక్కా వ్యూహం ఉందా..? అర్జాలబావి నుంచి నేరేడుచర్ల దాకా తీవ్ర ఉద్రిక్తతల నడుమ ఆయన పర్యటన కొనసాగడం చూస్తుంటే అదే అనిపిస్తోందని అంటున్నారు విశ్లేషకులు.
అర్జాలబావి ఐకేపీ సెంటర్ లో బండి వాహనంపై కోడిగుడ్లు, రాళ్లతో విరుచుకుపడిన టీఆర్‌ఎస్ శ్రేణులు.. చిల్లపల్లిలోనూ దాడికి పాల్పడ్డారు. కోడిగుడ్లు, రాళ్లు విసిరారు. ఇటు సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో కూడా టీఆర్ఎస్ శ్రేణులు రెచ్చిపోయారు. బండి కాన్వాయ్ పై రాళ్లు, గుడ్లు విసిరారు.
ఈ దాడుల్లో కార్ల అద్దాలు ధ్వంసం అయ్యాయి. పోలీసులు కూడా చేతులెత్తేసిన పరిస్థితి కనిపించింది. టీఆర్‌ఎస్ నేతలు కావాలని వారి అనుచరులను రెచ్చగొట్టి ఈ దాడులు చేయించారని ఆరోపిస్తున్నారు బీజేపీ నేతలు.