హైదరాబాద్ బయోడైవర్సిటీ దగ్గరి ఫ్లై ఓవర్ ప్రమాదాలకు నిలయంగా మారింది. ఫ్లై ఓవర్ ను ప్రారంభించి నెల రోజులు కూడా గడవక ముందే మూడు ప్రమాదాలు జరిగాయి. తాజాగా ఓ కారు ఫ్లై ఓవర్ పై నుంచి కిందకు పడిపోయింది. ఈ సంఘటనలో ఫ్లై ఓవర్ కింద ఆటో కోసం ఎదురు చూస్తున్న మహిళపై కారు పడడంతో ఆమె చనిపోయింది. కారు డ్రైవర్ కు గాయాలయ్యాయి. ఫ్లైఓవర్‌పై మలుపు దగ్గర స్పీడ్ కంట్రోల్ కాకపోవటంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ఫ్లైఓవర్ డిజైన్‌లో లోపం…చాలా మలుపులు ఉండటంతో ఇలా ప్రమాదాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఏ మాత్రం స్పీడ్ ఎక్కువైనా సరే… ఫ్లైఓవర్‌పై స్పీడ్‌ను కంట్రోల్ చేయటం కష్టంగా ఉంటుందని వాహనదారులు చెబుతున్నారు.
గత వారం ఇదే ఫ్లైఓవర్‌పై ఓ జంట సెల్ఫీ తీసుకుంటుండగా ఓ కారు వచ్చి ఢీకొట్టింది. దీంతో వారు ఫ్లైఓవర్ పైనుండి కింద పడి చనిపోయారు. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారికి ప్రయోజనం చేకూర్చడం కోసం ఫ్లైఓవర్ డిజైన్‌లో హడావుడిగా మార్పులు చేసి నిర్వించడం వ్లలే నిర్మాణంలో లోపాలు ఏర్పడి ప్రమాదాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.