దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ దశల వారీగా కొనసాగుతుంది. మొదట హెల్త్ కేర్ వర్కర్లకు, ఆ తర్వాత ఫ్రంట్ లైన్ వర్కర్లకు కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నారు. అయితే, కొంతమంది వ్యాక్సిన్ పై భయంతో, వ్యాక్సిన్ పై ఉన్న రకరకాల చెడు ప్రచారంతో వ్యాక్సిన్ వేసుకునేందుకు వెనుకంజ వేశారు. దీంతో మీ అవకాశం ఒక్కసారి మిస్ అయితే మళ్లీ ఇప్పట్లో మీకు వ్యాక్సిన్ ఇచ్చే అవకాశం ఉండదు అంటూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్డర్ వేశాయి.
అయితే, వ్యాక్సిన్ పై భ్రమలు క్రమంగా తొలిగిపోతున్నాయి. వ్యాక్సిన్ సేఫ్ అని స్పష్టమవుతున్న నేపథ్యంలో… హెల్త్ కేర్ వర్కర్లకు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు మరోసారి ఛాన్స్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 20, 2021వరకు వ్యాక్సిన్ ఇచ్చేలా చూడాలని ఆదేశించింది. మార్చి 1కల్లా వీరంతా వ్యాక్సిన్ తీసుకొని ఉండేలా చూడాలని కేంద్ర వైద్యారోగ్యశాఖ సూచించింది.
దేశంలో ఇప్పటి వరకకుక 65.2లక్షల మంది వ్యాక్సిన్ తీసుకోగా… ఇందులో 55,85,043 హెల్త్ కేర్ వర్కర్లుండగా, 9,43,167 ఫ్రంట్ లైన్ వర్కర్లున్నట్లు కేంద్రం ప్రకటన విడుదల చేసింది.