అక్కినేని కుటుంబానికి, దర్శకుడు విక్రమ్ కె కుమార్ కి మధ్య ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది. పైగా మనం వంటి బ్లాక్ బాస్టర్ మూవీతో అక్కినేని కుటుంబానికి ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా ఇచ్చాడు దర్శకుడు. అందుకే హలో ఫ్లాప్ అయినా ఇప్పుడు థ్యాంక్యూ ఆ కుటుంబం నుండే చేస్తున్నారు.
అయితే, ఇప్పుడు అక్కినేని హీరోలందరితో కలిసి మరో సినిమా చేసేందుకు విక్రమ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మనం వంటి మరో ఫ్యామిలీ కథతో ఈ మూవీ రాబోతుందని తెలుస్తోంది. నాగార్జున, చైతూ, అఖిల్ తో పాటు ఈ సారి సుమంత్, సుశాంత్, అమల కూడా కనపడబోతున్నారు. అయితే, దీన్ని మనంతో పోల్చేలా ఉంటుందా? డిఫరెంట్ గా ఉంటుందా? అనేది పక్కనపెడితే సినిమా మాత్రం అక్కినేని కుటుంబానికి మరో తియ్యని గుర్తుగా మిగిలిపోయేలా సినిమా ఉంటుందని అన్నపూర్ణ స్టూడియోస్ వర్గాలంటున్నాయి. పైగా మనం వంటి క్లాసికల్ హిట్ తర్వాత వస్తున్న సినిమా కావటంతో అంచనాలు కూడా అదే రేంజ్ లో ఉన్నాయి.