రేపు విడుదల కానున్న ‘చపాక్ ‘ సినిమాపై మరో వివాదం మొదలైంది. యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ కథా ఆధారంగా నిర్మించిన ఈ సినిమా లో పాత్రలను వక్రీకరించారని కొందరు ఆరోపిస్తున్నారు. నిజానికి 2005 లో లక్ష్మీ అగర్వాల్ పై యాసిడ్ దాడి చేసిన దోషి ఢిల్లీ ఖాన్ బజార్ కు చెందిన 32 ఏళ్ల ‘నయీమ్ ఖాన్’ అయితే సినిమాలో మాత్రం నయీమ్ ఖాన్ కు బదులుగా ‘రాజేష్’ అనే పేరు పెట్టినట్టు ఒక వర్గం మీడియా రాసింది. దీంతో పడుకొనే విమర్శకులు సోషల్ మీడియాలో దాడిని మరింత ఉదృతం చేశారు. సెక్యులరిజం అంటే నదీం పేరను రాజేష్ గా మార్చడమా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. నిజ జీవిత కథ ఆధారంగా తీసిన సినిమాలో అసలు దోషి పేరు మార్చి హిందూ పేరు పెట్టడంపై మండిపడుతున్నారు. సెక్యులరిజం ముసుగులో ముస్లిం దోషిని హిందువుగా మార్చారని బీజేపీ హర్యానా ఐటీ సెల్ అధ్యక్షుడు అరుణ్ యాదవ్ విమర్శించారు. ‘నయీమ్’ పేరును ‘రాజేష్’ గా మార్చిన విషయంపై వాస్తవాలు తెలుసుకోమని తన వారిని కోరానని..ఒక వేళ అదే నిజమైతే దీపికా పడుకొనే పై పరువు నష్టం కేసు వేస్తామని బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి తెలిపారు.