రానా దగ్గుబాటి… కొత్త తరహా కథలను ఎంచుకుంటూ తనదైన శైలీలో ముందుకు సాగుతున్న నటుడు. ప్రతి సినిమాకు ఓ ప్రత్యేకత చూపిస్తున్నాడు. అటు బాలీవుడ్ లోనూ నటిస్తున్న రానా… ఈవారం అరణ్య మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక నక్సలైట్ గా మెరిసిన విరాటపర్వం కూడా విడుదలకు రెడీ అవుతుంది.
తాజాగా రానా మరో ఇంట్రెస్టింగ్ మూవీ సైన్ చేసినట్లు తెలుస్తోంది. 14రీల్స్ పతాకంపై అనిల్ సుంకర్, రామ్ అచంట నిర్మాతలుగా… ఓ కొత్త దర్శకుడు సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు రానా ఓకే చెప్పారని ఇండస్ట్రీ టాక్. ప్రజెంట్ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ మూవీ… పక్కా మాస్ మూవీ అని తెలుస్తోంది.
త్వరలోనే సినిమాకు సంబంధించిన అన్ని విషయాలు అధికారికంగా వెల్లడించబోతున్నారు.