దర్శకుడు రాజమౌళి చేసిన సినిమాలంతా బ్లాక్ బాస్టర్ హిట్సే. కానీ ఇంత వరకు ఏ సినిమాకు కూడా జక్కన్న సీక్వెల్ చేయలేదు. ఇక రీమేక్ అనే పదమే ఆయనకు వినిపించదు. కానీ రాజమౌళి డైరెక్ట్ చేసిన విక్రమార్కుడు సినిమాకు రచయిత విజయేంద్ర ప్రసాద్ సీక్వెల్ కథ రెడీ చేశారు. దీంతో రాజమౌళి ఈ సారి తన రూట్ మారుస్తారా అన్న చర్చ జరిగింది.
అయితే, విక్రమార్కుడు-2 మరో దర్శకుడు సంపత్ నంది చేతికి వెళ్లిపోయింది. మాస్ సినిమాలను సూపర్ గా హ్యాండిల్ చేస్తారని పేరున్న సంపత్ నంది హీరో రవితేజతో విక్రమార్కుడు-2 చేయబోతున్నారు. గతంలో వీరి కాంభినేషన్ లో బెంగాల్ టైగర్ మూవీ వచ్చింది. ఇటీవలే సిటీమార్ తో హిట్ కొట్టిన సంపత్ నంది రవితేజకు విక్రమార్కుడు-2తో ఎలాంటి హిట్ ఇస్తాడో చూడాలి.