సిద్దిపేట జిల్లాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. తొగుట మండలం రాంపూర్ శివారులో ఈ ఘటన చోటు చేసుకుంది. తిరుపతి, వంశీ అనే ఇద్దరి మధ్య ఈ కాల్పులు జరిగాయి.
దుబ్బాక మండలం చెల్లాపూర్ కు చెందిన వీరి మధ్య భూవివాదం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారణంతోనే ఒకరిపై ఒకరు కాల్పులకు తెగబడినట్లు సమాచారం.
కొద్దిరోజుల క్రితం కూడా సిద్దిపేటలో కాల్పులు కలకలం రేపాయి. ఆనాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ఓ కారుపై కాల్పులు జరిపిన దుండగులు.. రూ.43.50 లక్షలు ఎత్తుకుపోయారు.
ఇలా వరుస కాల్పుల ఘటనలు జరుగుతుండడంతో జిల్లా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.