కరోనా లాక్ డౌన్ నుండి వలస కార్మికులు, విదేశాల్లో చిక్కుకుపోయిన వారి కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రియల్ హీరో సోనూ సూద్. సామాజిక సమస్యలు, రైతాంగ సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తున్న సోనూ సూద్ తాజాగా ఫిలిప్పీన్స్ లో ఉన్న భారతీయులను ఇంటికి చేర్చేందుకు మరో ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు.

అన్ లాక్స్ కోసం ప్రభుత్వాలు ఫేజ్ ల వారీగా ఎలా పని ప్రకటిస్తున్నారో… సోనూ సూద్ కూడా ఇది ఫేజ్-2 అంటూ ట్విట్టర్ లో ప్రకటించారు. మీరందరూ మీ కుటుంబాలను కలుసుకునేందుకు సిద్ధంగా ఉన్నారనుకుంటున్నా. మీ కోసమే మనీలా నుంచి ఢిల్లీకి ఆగస్టు 14 సాయంత్రం 7.10 గంటలకు ఎస్జీ9286 అనే విమానం బయల్దేరబోతోంది. మిమ్మల్ని ఆ విమానంలో ఎక్కించుకుని సొంతగడ్డకు చేర్చేందుకు ఎదురు చూస్తున్నాం అంటూ కామెంట్ చేశారు. ఆగస్టు 14న ఈ విమానం బయలుదేరబోతుంది.
గతంలో కజకిస్థాన్ లో చిక్కుకున్న వారిని, కేరళ నుండి ఒడిశా వలస కూలీల కోసం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసిన సోనూ సూద్… వందలాది బస్సుల్లో నడకదారిన సొంతూరు బయలుదేరిన జనానికి బస్సులు ఏర్పాటు చేసి, భోజన వసతి కల్పించాడు.