హీరో సూర్య… పేరుకు తమిళ నటుడే అయినా తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే తన ప్రతి సినిమా తెలుగులో డబ్ అవుతుంది. పైగా సూర్య తెలుగులో బాగా మాట్లాడగలగటం అదనపు అడ్వాంటేజ్.
సూర్య హీరోగానే కాదు సామాజిక సేవ చేస్తూ… అందరికీ ఆదర్శంగా ఉంటాడు. తన ఆగారం ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న సూర్య… వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు ఈ నిర్ణయం అందరితోనూ సెల్యూట్ చేసేలా ఉంది.
కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారికి చేయూతనిచ్చి, తాము కూడా బ్రతకగలం అన్న విశ్వాసం పెంపొందించే స్వచ్ఛంద సంస్థ థాంకర్ ఇండియాతో చేతులు కలిపాడు. తను కూడా వారితో కలిసి పనిచేస్తానని ప్రకటించాడు.
ఇటీవలే ఆకాశం నీ హద్దురా సినిమాతో మంచి హిట్ కొట్టిన సూర్య… పండిరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.