హైదరాబాద్ పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆజంపూరాలోని టైర్ల గోడౌన్ లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. గోడౌన్ నుంచి భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో స్థానికలు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
కాగా ఇటీవల హైదరాబాద్ లో వరుసగా అగ్ని ప్రమాద ఘటనలు చోటు చేసుకోవడంతో నగరవాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.