తమిళనాట చాలామంది మాస్ హీరోలున్నారు. రజనీకాంత్, అజిత్, విజయ్ తో మొదలుపెడితే.. విశాల్ వరకు చాలామంది మాస్ సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి మరో హీరో చేరాడు. అతడే అరుణ్ విజయ్. చాన్నాళ్లుగా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న ఈ నటుడు, తన తాజా చిత్రంతో మాస్ ఇమేజ్ దక్కించుకున్నాడు.
హరి దర్శకత్వంలో ఏనుగు అనే సినిమా చేశాడు అరుణ్ విజయ్. యముడు సిరీస్ తెరకెక్కించింది ఇతడే. ఇలాంటి దర్శకుడితో సినిమా అంటే కచ్చితంగా మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఏనుగు(తమిళ్ లో యానై)లో కూడా అలాంటి అంశాలే ఉన్నాయి. పైగా సినిమా తమిళనాట హిట్టవ్వడంతో, అరుణ్ విజయ్ మాస్ హీరో అయిపోయాడు. తను కోరుకున్న ఇమేజ్ దక్కించుకున్నాడు.
ఇంతకుముందు తెలుగులో సాహోతో పాటు కొన్ని సినిమాల్లో నటించాడు అరుణ్ విజయ్. అటు కోలీవుడ్ లో హీరోగా నటిస్తూనే, కొన్ని కీలక పాత్రలు పోషించాడు. ఇప్పుడు సోలో హీరోగా ఎదిగాడు.
అన్నట్టు తెలుగులో కూడా ఈ సినిమాకు మంచి రివ్యూస్ వచ్చాయి. కానీ.. థియేటర్లకు వెళ్లి సినిమా చూడ్డానికి ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.