వకీల్ సాబ్ మూవీతో రాజోలు బ్యూటీ ఫేట్ మారిపోతున్నట్టే కనిపిస్తోంది. ఆ సినిమాకు ముందు చాలా రోజులుగా ఆఫ్‌లైన్‌లో ఉండిపోయిన ఈ చిన్నది.. మళ్లీ ఈ మూవీ తర్వాత తరచూ వార్తల్లో నానుతోంది. ఏదో ఒక ఆఫర్ వచ్చిందన్న ప్రచారంతో తెరపైకి వస్తోంది. అయితే అవన్నీ చివరికి పట్టాలెక్కలేదు గానీ.. తాజాగా ఈ ముద్దుగుమ్మకు ఓ బంపర్ ఆఫర్ తగిలినట్టుగా టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది.
మలయాళంలో సూపర్ హిట్ అయిన నాయట్టు మూవీని గీతా ఆర్ట్స్ తెలుగులో రీమేక్ చేయాలని అనుకుంటోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన రైట్స్ కూడా కొనుక్కుంది. ఈ మూవీని త్వరలో పట్టాలెక్కించాలని గీతా ఆర్ట్స్ భావిస్తోంది. అయితే ఇందులో కీ రోల్‌ను అంజలితో చేయించాలని నిర్మాతలు అనుకుంటున్నారట. ఇప్పటికే చాలా మందిని ఈ పాత్ర కోసం వాకబు చేసినప్పటికీ.. చివరికి అంజలి వద్ద ఆగిపోయారట. దాదాపు అమ్మడనే ఫిక్స్ చేస్తారని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.