సైదాబాద్ సింగరేణి కాలనీలో చిన్నారిపై హత్యాచారం ఘటన మరవక ముందే హైదరాబాద్ లోని మంగళహట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో దారుణం చోటు చేసుకుంది. మంగళహట్ పి ఎస్ పరిధిలోని ఓ తొమ్మిదేళ్ల చిన్నారిని ఖాళిగా ఉన్న దుకాణం షేటర్ లోకి తీసుకుని వెళ్లి సుమిత్ అనే వ్యక్తి అత్యాచారం చేయబోయాడు.
అయితే, ఇది గమనించిన స్థానికులు వెంటనే అలర్ట్ కావటంతో వారిని చూసిన సుమిత్ అక్కడి నుండి పరారయ్యాడు. స్థానికుల అప్రమత్తతో ఆ తొమ్మిదేళ్ల బాలికకు ఎలాంటి అపాయం కలగలేదు. నిందితున్ని లంగర్ హౌస్ పోలీసులు అత్తాపుర్ లో అదుపులోకి తీసుకున్నారు.