హైదరాబాద్ నగర నడిబొడ్డున సైదాబాద్ సింగరేణి కాలనీ లో ఆరేళ్ళ చిన్నారి పై అత్యాచారం, ఆపై హత్య జరిగాయి. ఘటన జరిగి వారం అవుతున్నా నిందితుడి రాజు కోసం పోలీసులు ఇంకా గాలిస్తూనే ఉన్నారు. ఇదే విషయమై రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడే నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. కాగా ఇటువంటి సమయంలో మరో చిన్నారి అదృశ్యం కలకలం రేపుతోంది.
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం శాంతి నగర్ కు చెందిన మైనర్ బాలిక దివ్యశ్రీ అదృశ్యమైంది. ఉదయం స్కూలుకి వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు భయం తో టూటౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.