ఇదివరకు అప్పు కావాలంటే బంధువులను, చుట్టూ పక్కల వాళ్ళని బ్రతిమాలాల్సి వచ్చేది. అప్పు కావాలంటే నానా తిప్పలు పడాల్సి వచ్చేది. కాలం మారింది కదా ఇప్పుడు అప్పు కోసం ఎవరి కాలు పట్టుకోవాల్సిన పనిలేకుండా పోయింది. మన ఫైనాన్షియల్ రికార్డ్స్ బాగుంటే అప్పులు ఇచ్చేందుకు పలు యాప్ లు రెడీ అంటున్నాయి. ఇటీవల స్మార్ట్ ఫోన్ బిజినెస్ లోకి అడుగుపెట్టిన రియల్ మీ సంస్థ ఫైనాన్షియల్ బిజినెస్ లోకి కూడా అడుగుపెట్టింది. ఇప్పటికే ఈ వ్యాపారంలోకి షావోమి ‘ఎంఐ క్రెడిట్’ తో కావాల్సిన వారికీ అప్పులను ఇస్తోంది. తాజాగా రియల్ మీ కూడా ఇదే తరహా వ్యాపారంలోకి వచ్చింది.
రియల్ మీ యాప్ నుంచి అప్పు కావాలంటే పెద్దగా చేయాల్సింది ఏమి లేదు. గూగుల్ ప్లే స్టార్ లోకి వెళ్లి ముందుగా ‘రియల్ మీ పేసా’ను ను ఇన్స్టాల్ చేసుకుపోవాల్సి ఉంటుంది. ఈ యాప్ ద్వారా ఫ్రీగా పర్సనల్ లోన్, బిజినెస్ లోన్ లాంటి సేవలను అందిస్తోంది. అప్పు కావాలనుకునే వారికీ రియల్ మీ పేసా ద్వారా 50,000నుంచి 50,000 లక్షల వరకు బిజినెస్ లోన్ పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. తీసుకొన్న అప్పును వాయిదాల ప్రకారంగా నెల వారీగా చెల్లించే వెసులుబాటును కూడా కల్పిస్తోంది. అయితే సంవత్సరం నుంచి 5ఏళ్ల కాలంలోనే బిజినెస్ నిమితం తీసుకున్న అప్పును తీర్చాల్సి ఉంటుంది.
పర్సనల్ లోన్ అయితే 8వేల నుంచి లక్ష రూపాయల వరకు అప్పును ఇస్తోంది. ఈ అప్పును 3నెలల నుంచి సంవత్సరంలోనే చెల్లించాల్సి ఉంటుంది. దాంతో చాలామంది ఈ యాప్ ల ద్వారా అప్పులను తీసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
Advertisements