దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా చత్రపతి, బాహుబలి వంటి చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అందుకు సంబంధించిన ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయట. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అందుకు సంబంధించి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
చాలా ఏళ్ల క్రితమే అడ్వాన్స్ ఇచ్చి ప్రభాస్ డేట్ ను బ్లాక్ చేశారట మైత్రీ సంస్థ. ఇప్పుడు రాజమౌళి తో కూడా సంప్రదింపులు చేస్తున్నారట. అన్ని అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే… త్వరలోనే ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నాడు. ఇక ప్రభాస్ విషయానికి వస్తే రాధేశ్యామ్ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. అలాగే సలార్, ఆదిపురుష్ తో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.