వెండితెరపై కొన్ని జోడీలు ప్రత్యేకంగా నిలుస్తుంటాయి. సినీ అభిమానులు కూడా ఆ జోడీలను వెండితెరపై ఎప్పుడెప్పుడూ చూస్తామా అని ఎదురుచూస్తుంటారు. అంతేకాదు, ఆ హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ ఎప్పుడూ కొత్తగానే ఫీల్ అవుతుంటారు అభిమానులు. అలాంటి జోడీల్లో ప్రభాస్- అనుష్కలకు ప్రత్యేక స్థానం ఉంది. వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు కూడా భారీ విజయాలను అందుకున్నాయి. అయితే, ‘బాహుబలి 2’ తరువాత ఈ జంట తెరపై మళ్లీ కనిపించలేదు.
ఈ క్రమంలో, ఈ జంట మరోసారి వెండితెరపై సందడి చేయనున్నట్లు గత కొన్ని రోజులుగా రూమర్లు వినిపిస్తోన్నాయి. అయితే, అవి పుకార్లు కాదని నిజంగానే ప్రభాస్-అనుష్క జంటగా మరో సినిమా రాబోతున్నట్లు సినీ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. టాలీవుడ్‌లో ప్రభాస్-అనుష్క జంటకు ఉన్న క్రేజ్ దృష్ట్యా డైరెక్టర్ మారుతి అనుష్కను ఒప్పినట్లు తెలుస్తోంది.
అయితే, అనుష్క ‘నిశ్శబ్దం’ తరువాత మరో సినిమా చేయలేదు. ఆమె రేంజ్‌కి తగ్గ అవకాశాలు రాకపోవటంతో స్వీటి కూడా సైలెంట్ అయిందని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమెను దర్శకుడు మారుతి ఒప్పించినట్లుగా ఒక వార్త షికారు చేస్తోంది.
దర్శకుడు మారుతి ప్రభాస్ హీరోగా ఒక సినిమా చేయనున్నారు. ఈ సినిమాకి ‘రాజా డీలక్స్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా అనుష్క అయితే ఈ ప్రాజెక్టుకు మరింత ప్లస్ అవుతుందని భావించిన ఆయన అనుష్కను ఒప్పించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అభిమానుల కోరిక త్వరలో నెరవేరనుందని తెలుస్తోంది.