రాంచరణ్ పుట్టిన రోజు సందర్భంగా… మెగా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. బర్త్ డే సర్ ఫ్రైజ్ గా ఒక రోజు ముందే ఆర్.ఆర్.ఆర్ టీం అల్లూరి పోస్టర్ విడుదల చేయగా, ఆచార్య నుండి క్రామెడ్ పోస్టర్ రిలీజ్ చేసి అందర్నీ ఉత్సాహపర్చారు దర్శకుడు కొరటాల.

అయితే, రాంచరణ్ తన 15వ సినిమాపై అనేక ఊహాగానాలున్నాయి. శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా సినిమా ఉంటుందని చర్చ సాగుతుంది. అయితే, ఎవరూ దీన్ని దృవీకరించటం లేదు. కానీ వచ్చే ఏడాది రంగస్థలం కాంభినేషన్ రిపీట్ అయ్యే అవకాశం ఉందని నిర్మాత నవీన్ యేర్నేని తెలిపారు.
సుకుమార్ – చరణ్ కాంబో రిపీట్ అయ్యే అవకాశం ఉందని, వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లొచ్చు అంటూ వ్యాఖ్యానించారు.