– మరో రియల్ మోసం
– కస్టమర్స్ ని ముంచేసిన పారిజాత హోమ్స్
– అంతా మార్కెటింగ్ సిబ్బందికి అప్పగింత
– ప్లాట్స్ అమ్మేసి డబ్బులతో చెక్కేసిన టీమ్
రియల్ ఎస్టేట్ రంగంలో మరో భాగోతం వెలుగుచూసింది. పారిజాత హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ శామీర్ పేట్ ప్రాంతంలో హెచ్ఎండీఏ లేఅవుట్ వేసింది. ఇందులోని ప్లాట్లని మార్కెటింగ్ సిబ్బందికి ఇచ్చి అమ్మమని నిర్వాహకులు చెప్పారు. మార్కెటింగ్ సిబ్బంది అమ్మగా వచ్చిన రూ.80 కోట్ల డబ్బులు తమ సొంత అకౌంట్లో జమ చేసుకున్నారు.
పారిజాత హోమ్స్ యాజమాన్యానికి ఈ డబ్బును అందజేయలేదు. దీంతో కొనుగోలు చేసిన వాళ్లకి ప్లాట్లు రిజిస్ట్రేషన్ కాలేదు. మార్కెటింగ్ సిబ్బంది చేసిన మోసానికి ప్లాట్ కొనుక్కున్న వారు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో బాధితులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మరి ఈ కేసులు తేలేది ఎప్పుడు? తమకు న్యాయం జరిగేది ఎప్పుడు? అని కస్టమర్లు అడుగుతున్నారు.
ఇప్పుడు పోలీస్ డిపార్ట్ మెంట్ ఇలాంటి విషయాల్లో కఠినంగా వ్యవహరిస్తే.. మళ్లీ ఇలాంటి మోసాలు జరగకుండా ఉంటాయని అంటున్నారు. పారిజాత యాజమాన్యం నిర్లక్ష్యంగా ఉండడం వల్ల తాము కట్టిన డబ్బులు రూ.80 కోట్లు దారి మళ్లినా ఎందుకు చర్యలు తీసుకోలేదు? అని కస్టమర్లు నిలదీస్తున్నారు.
పోలీసులు, పారిజాత యాజమాన్యం తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా దీనిపై త్వరగా చర్యలు తీసుకోకపోతే ఇది కూడా మరో సాహితి, జయ గ్రూప్ కాక తప్పదని.. ప్లాట్లు కొనే కస్టమర్స్ అన్నీ చూసుకుని కొనడం బెటర్ అని లేకపోతే చిక్కుల్లో పడాల్సి వస్తుందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.