తెలంగాణ కోసం పోరాడిన మరో ఊపిరి ఆగిపోయింది. స్వరాష్ట్రంలో సర్కారు కొలువులొస్తాయని భావించి… ఎన్నో కలలుగన్న నిరుద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ప్రభుత్వ ఉద్యోగమే ధ్యేయంగా పోటీ పరీక్షల్లో పోటీపడి… చివరకు ఓడిపోయాడు.
ప్రభుత్వం వేసిన ఆరకొర ఉద్యోగాల్లో ఉద్యోగం సాధించలేదన్న బాధ ఒకవైపు, కొత్త నోటిఫికేషన్లు రాని బాధ మరోవైపు… ఇంట్లో వాళ్లు, ఊర్లో వాళ్లకు మొహం చూపించలేక మదనపడ్డ నవీన్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. జగిత్యాల జిల్లా మల్యాలకు చెందిన నవీన్, ఓయూలో టాప్ ర్యాంకర్. 2013లో జర్నలిజంలో పీజీ చేశాడు. అప్పటి నుండి ఓయూలోనే ఉంటూ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ వచ్చాడు. ఇటీవలే స్వగ్రామం వెళ్లిన నవీన్… ఇంకా ఎన్నాళ్లు ఉద్యోగం లేకుండా ఉండాలి అన్న బాధతో… ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.