ఆన్ లైన్ లోన్ యాప్స్ కు ఆకర్షితులైన పాపానికి మరోకరు బలయ్యారు. ఆన్ లైన్ లోన్ యాప్ ల వేధింపులతో సాఫ్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. వ్యక్తుల అవసరాలే ఆసరాగా ఆన్ లైన్ లోన్స్ సంస్థలు వేధింపులకు దిగుతున్నాయి.
సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సునీల్ అవరంస కోసం ఇన్ స్టాంట్ లోన్ లో 70 అప్పు తీసుకున్నారు. 70 వేలు అప్పు తీర్చాలంటూ యాప్ ప్రతినిధులు తీవ్ర స్థాయి లో ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆ బాకీ తీర్చేందుకు సునీల్ మరో సంస్థలో లోన్ తీసుకన్నారు. దీంతో తనకు తెలియకుండానే తాను భారీ అప్పుల్లో కూరుకపోయారు.
సునీల్ అప్పు చెల్లించటం లేదంటూ తల్లికి ఫోన్ చేసి యాప్ ప్రతినిధులు వేధించారు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన సునీల్ రాజేంద్రనగర్ లోని కిస్మత్ పూర్ లోని ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. సునీల్ భార్య రమ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇప్పటికే సిద్ధిపేట జిల్లాకు చెందిన ఓ యువతి కూడా ఈ ఆన్ లైన్ లోన్ ప్రతినిధుల వేధింపులు తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.