ప్రార్థనా స్థలాల (ప్రత్యేక నిబంధనలు) చట్టం- 1991లోని కొన్ని సెక్షన్ల రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. ఈ చట్టం లౌకికవాద సూత్రాలను ఉల్లంఘిస్తోందని మధురాకు చెందిన దేవకి నందన్ పిటిషన్ దాఖలు చేశారు.
ఆర్టికల్ 14, 15, 21లను ఈ చట్టం ఉల్లంఘిస్తోందని పేర్కొంటూ, ప్రార్థన స్థలాల (ప్రత్యేక నిబంధనలు) చట్టం 1991లోని సెక్షన్ 2, 3, 4ల రాజ్యాంగ చెల్లుబాటును పిటిషన్ లో సవాలు చేశారు.
రాజ్యాంగంలోని 25, 26, 29, రాజ్యాంగం ప్రవేశిక, ప్రాథమిక నిర్మాణంలో అంతర్భాగమైన లౌకికవాదం నియమాల సూత్రాలను చట్టం ఉల్లంఘిస్తోందని ఆయన పేర్కొన్నారు.
కృష్ణుడి జన్మస్థలం పునరుద్ధరణ కోసం వందల ఏళ్లుగా హిందువులు శాంతియుత ప్రజాందోళనలు చేస్తున్నారు. రాముడు, కృష్ణుడు విష్ణువు అవతారలనీ అయినప్పటికీ ఈ చట్టం చేయడం ద్వారా కేంద్రం అయోధ్యలోని శ్రీరాముడి జన్మస్థలాన్ని మినహాయించింది కానీ మధురలోని శ్రీకృష్ణ జన్మస్థలాన్ని మినహాయించలేదు’ అని తెలిపారు.
ఈ చట్టం హిందువులు, జైనులు, బౌద్ధులు, సిక్కుల ప్రార్థనా స్థలాలు, తీర్థయాత్రల నిర్వహణ, నిర్వహణ హక్కులను ఉల్లంఘిస్తుందని ఆయన అన్నారు.