మరో రెండ్రోజుల్లో క్రికెట్ పండుగ ఐపీఎల్ మొదలుకానుంది. ఫస్ట్ మ్యాచ్ లోనే బెంగుళూరు ఆడనుండగా… బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు ఆల్ రౌండర్ డేనియల్ సామ్స్‌కు కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో జట్టులో కలకలం నెలకొంది.
నిజానికి డేనియల్ సామ్స్ తన ఆర్సీబీ టీంతో కలిసి చెన్నై హోటల్ కు వచ్చాడు. ఆ సమయంలో కరోనా టెస్ట్ చేయగా నెగెటివ్ వచ్చింది. దీంతో తనను బయో బబుల్ లోకి తీసుకున్నారు. ఇక అంతా సేఫ్ అనుకున్నారు. కానీ నిబంధనల ప్రకారం సెకండ్ టైం కరోనా టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆ ఆటగాన్ని ఐసోలేషన్ కు తరలించారు. తనకు ఎలాంటి కరోనా లక్షణాలు కనపడటం లేదు. బెంగుళూరు హెల్త్ టీం చికిత్స అందిస్తుంది.
బీసీసీఐ మార్గదర్శకాల ప్రకారం డేనియల్ ను 10రోజుల పాటు ఐసోలేషన్ లో ఉంచనున్నారు.