ఓవైపు దేశమంతా కరోనా భయానికి అల్లాడిపోతుంది. ప్రభుత్వాలన్నీ కరోనా వైరస్ ను ఎలా నివారించాలని తలమునకలయ్యాయి. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ… చర్యలను ముమ్మరం చేస్తుంటే, కరోనా వైరస్ తో తమకేం ఇబ్బంది అన్నట్లుగా సీఎం జగన్ కోటరిలోకి మరో రెడ్డి వచ్చి చేరారు.
ఓవైపు కరోనా వైరస్ ప్రభావం నడుస్తున్నా… గప్ చుప్ గా మరో రెడ్డి సీఎం జగన్ కోటరిలో చేరిపోయారు. సాక్షి దినపత్రికలో పనిచేసిన ధనుంజయ రెడ్డిని సీఎం సలహదారుగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. విలేజ్ వాలంటరీలు, గ్రామ, వార్డు సచివాలయాల బాధ్యతలను ఆయనకు అప్పజెప్పారు. మంగళవారం నాడు ఈ మేరకు జీవో జారీ చేశారు.
ఇప్పటికే ఏపీ సీఎం కోటరిలో రెడ్డి సంఖ్య ఎక్కువగా ఉందన్న విమర్శలు వస్తున్నా, కరోనా పోరును పక్కనపెట్టి మరీ పదవుల పందేరం కొనసాగిస్తున్నారని, ఎదుటి వారిని కులం పేరుతో దూషిస్తూ…. తాను కులం మర్చిపోవటం లేదు అంటూ సీఎం జగన్ పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.