ఓవైపు జీతం రాక, ప్రభుత్వ మొండివైఖరితో ఆందోళన చెంది మరో ఆర్టీసీ కార్మికుడు తనువు చాలించాడు. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబాబాద్ డిపోకు చెందిన డ్రైవర్ నరేష్ బుధవారం తెల్లవారుజామున పురుగులమందు తాగటంతో… కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే నరేష్ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఓవైపు కోర్టు ప్రభుత్వాన్ని ఎంత హెచ్చరిస్తున్నా… ప్రభుత్వం మాట వినటం లేదని, కోర్టు చెప్పిన కేసీఆర్ వినకపోతే ఎవరికీ వినరు అంటూ ఆవేదనతో నరేష్ మదనపడేవారని తోటి కార్మికులు చెబుతున్నారు. నరేష్ మృతితో విషాధచాయలు అలుముకున్నాయి.
నిన్న దీక్షలో కూర్చున్న తమ తోటి కార్మికుడు ఆత్మహత్య చేసుకోవటంతో నరేష్ మృతదేహంతో మహబూబాబాద్ డిపో ముందు ధర్నాకు దిగారు ఆర్టీసీ కార్మికులు. నరేష్ కుటుంబాన్ని ఆదుకోవాలని, నరేష్ మృతికి ప్రభుత్వం, కేసీఆరే బాధ్యులంటూ ఆర్టీసీ కార్మికులు ఫైర్ అవుతున్నారు. దాంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న డిపోల ముందు పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
మహబూబాబాద్ డిపో ముందు నరేష్ మృతదేహంతో ధర్నా విజువల్స్ కోసం క్లిక్ చేయండి