మహేష్ బాబు 28వ సినిమాపై ఇటీవల అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అతడు , ఖలేజా వంటి విభిన్నమైన సినిమాల అనంతరం త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో మహేష్ బాబు హై వోల్టేజ్ పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది.
ఇక సినిమాకు ‘పార్ధు’ అనే వర్కింగ్ టైటిల్ ను కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం.ఇక దర్శకుడు త్రివిక్రమ్ క్యాస్టింగ్ పనులను పూర్తి చేయకముందే అప్పుడే హీరోయిన్ విషయంలో అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి.
ఒక సీనియర్ హీరోయిన్ కూతురిని ఫిక్స్ చేసినట్లు టాక్ వస్తోంది. ఆమె మరెవరో కాదు. అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్. ఆమె వయసు ప్రస్తుతం 24ఏళ్ళు. ఇక మహేష్ బాబు 45 ఏళ్ళ వయసులో ఉన్నప్పటికీ పాతికేళ్ల కుర్రాడిలానే ఉంటాడు.
ఈ జోడి కథకు పర్ఫెక్ట్ గా సెట్టవుతుందని త్రివిక్రమ్ ఆలోచిస్తున్నాడట. మొదట పూజా హెగ్డేను అనుకున్నప్పటికి రోటీన్ అయిపోతుందని మనసు మార్చుకున్నారు. మరి జాన్వీ విషయంలో మహేష్ – త్రివిక్రమ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.