ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ఆర్‌ఎక్స్ 100తో యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించిన హీరో కార్తీకేయ. అందుకే తన కొత్త సినిమా 90MLపై కూడా భారీ అంచనాలతో రిలీజ్ అయినా… డిజాస్టర్ తప్పదన్నట్లే కనపడుతోంది. సినిమా మొత్తాన్ని ట్రైలర్‌లోనే చూపించినట్లు సినిమా చూశాక అర్థమవుతుంది. కొత్త పాయింట్‌తోనే వచ్చినా… రొటిన్ సినిమాల స్టైల్‌లోనే సాగుతుంది అని చెప్పక తప్పదు.
విక్టరీ వెంకటేష్ వారసుల ఎంట్రికి ముహుర్తం ఫిక్స్
ఇక ఫస్ట్‌టైమ్ డైరెక్టర్ శేఖర్ రెడ్డి కమర్షియల్‌గా కాస్త ఆలోచించినట్లే సినిమా మొదలుకాగానే అర్థమయిపోతుంది. ఎలాంటి కొత్తదనం లేకుండా… ఫ్లాట్‌గా సాగిపోతుంది సినిమా అంతా. మందు చుట్టూ తిరిగే సినిమా కావటం… సహజంగానే హీరోయిన్ హీరోతో మందు మాన్పించే యజ్ఞానికి పూనుకోవటం… మధ్యలో కామెడీ కమ్ విలన్ పాత్ర టైపులో ఉండే రవి కిషన్‌తో అలా సినిమాను నడిపించారు. క్లైమాక్స్ కూడా కొత్తగా ఏం లేదు… సినిమా కథను ఎలా ఎండ్ చేయాలో ఎంతో ఆలోచించి, ఎటూ అర్థంకాక ఓ ముగింపుకు తీసుకొచ్చినట్లుగా ఉంటుంది.
అయితే… కార్తీకేయ మాత్రం తన నటనను కాస్త మెరుగుపర్చుకున్నట్లు కనపడుతుంది. అయితే సంగీతం కాస్త బెటర్‌గా ఉన్నా… కథలో మంచి పాయింట్ ఉన్నా… సినిమాను నరేట్ చేయటంలో ఫెయిల్యూర్ అని మాత్రం చెప్పక తప్పని సినిమా 90ML.
పంచ్ లైన్– ఎంత తాగినా ఎక్కదే