ఏపీలోని మదనపల్లిలో కన్న బిడ్డలను క్షుద్రపూజలకు బలిచ్చిన తలితండ్రులను విచారిస్తున్న పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలుస్తున్నాయి. ఈనెల 24న ఇద్దరు బిడ్డల ప్రాణాలు తీయగా… తల్లి పద్మజ మరీ వెర్రీగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. పెద్ద కూతురు అలేఖను చంపిన అనంతరం, తనను తాను కాళిమాతగా భావించి అలేఖ్య నాలుక కోసి పద్మజ తినేసిందని భర్త పురుషోత్తం నాయుడు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై పోస్టుమార్టం నివేదిక వస్తే కానీ స్పష్టత రాదు.
తాను పూర్వజన్మలో అర్జునుడినని అలేఖ్య చెప్పేదని, కళాశాలలో పాఠాలు చెప్పడం నీ వృత్తి కాదు.. పాండవుల తరఫున అర్జునుడు ముందుండి నడిపిన పోరాటస్ఫూర్తిని కొనసాగించాలని అలేఖ్య తనను పదేపదే అనేదని పురుషోత్తం పోలీసులకు తెలిపాడు. కలియుగం అంతమై.. సత్యయుగం వస్తుందని అలేఖ్య అనేది. కరోనా కూడా ఇందుకు ఒక సూచిక అని చెప్పేది. ఈ మాటలన్నీ నిజమే. నేను చదివిన ఆధ్యాత్మిక పుస్తకాల్లోనూ ఈ విషయాలే ఉన్నాయని ఆయన వైద్యులకు చెప్పాడు.
వీరిని జైల్లో ఉంచి మానసిక వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఉంచాలని రుయా ఆసుపత్రి నుండి విశాఖ ఆసుపత్రికి తరలించాలని సిఫార్సు చేశారు. అయితే, పద్మజ తండ్రి, మేనమామ కూడా ఇలాంటి మానసిక వ్యాధితో బాధపడ్డవారేనని తెలుస్తోంది. అలా వంశపారంపర్యంగా వచ్చిన వ్యాధే పెద్ద కూతురుకు కూడా సోకినట్లు ఉందని అనుమానిస్తున్నారు.