డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కిన సినిమా ఇస్మార్ట్ శంకర్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో పాటు భారీ కలెక్షన్లను రాబట్టింది. ప్రస్తుతం రామ్ ఆ సినిమా ఇచ్చిన హిట్ జోష్ తోనే ఉన్నాడు. ఇక ప్రస్తుతం రామ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో రెడ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన సాంగ్స్, రామ్ లుక్ సినిమాపై అంచనాలను పెంచగా తాజాగా మరో వీడియో సాంగ్ బిట్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
నువ్వే.. నువ్వే అంటూ సాగే ఈ వీడియోలో రామ్ మాళవిక శర్మ నటించారు. ఈ పాటని అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా పాడగా సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించారు. ఇక ఇటీవల హెబ్బా పటేల్ రామ్ ల మధ్య నడిచే డించక్…డించక్ సాంగ్ రిలీజ్ చేయగా ప్రస్తుతం ఆ సాంగ్ యూట్యూబ్ లో ట్రెండ్ లో ఉంది.
<iframe width=”560″ height=”315″ src=”https://www.youtube.com/embed/U2OOxS1AB5g” frameborder=”0″ allow=”accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture” allowfullscreen></iframe>