వాట్సాప్” వ్యాపార, ఉద్యోగ, కుటుంబ, విద్య, వైద్య, ఆర్ధిక ఇలా ఏ ఒక్కటి చూసినా సరే దీనికి ముడిపడే ఉంది. మన జీవితంలో ఇంతగా దగ్గరైన యాప్ ఈ మధ్య కాలంలో ఇదే. ఫేస్బుక్, ట్విట్టర్ లు ఉన్నా సరే వాట్సాప్ లో గోప్యత ఎక్కువగా ఉండటం తో చాలా మంది ఈ సంస్థతో ఉంటున్నారు. ఇక వాట్సాప్ తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్తగా ఫీచర్స్ ను తీసుకొస్తుంది.
ఇప్పుడు మరో ఫీచర్ ను కూడా తెచ్చింది ఈ సంస్థ. వినియోగదారులు బ్యాక్‌గ్రౌండ్‌లో వాయిస్ నోట్స్ వినడానికి వీలు కల్పించే కొత్త ఫీచర్‌ను వాట్సాప్ ప్రారంభించింది. మెటా యాజమాన్యంలోని ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఐఓఎస్ బీటాలో కొత్త గ్లోబల్ వాయిస్ నోట్ ప్లేయర్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటన చేసింది. కొత్త ప్లేయర్‌ని ఉపయోగించి, వాట్సాప్ వినియోగదారులు వేరే చాట్ లేదా హోమ్ స్క్రీన్‌లో ఉన్నప్పుడు వాయిస్ మెసేజ్ ను వినే అవకాశం ఉంటుంది.
ఇప్పటి వరకు, మనం చాట్ నుండి వాట్సాప్ హోమ్ స్క్రీన్‌కి లేదా యాప్‌లోని మరొక చాట్‌కి వెళ్తే వాయిస్ ప్లే కావడం ఆగిపోతుంది. దీనిపై చాలా మంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసారు. దాదాపు గంట సేపు ఉండే వాటిని వినడం కష్టం అని… ఒకే చాట్ లో ఉండి వినడం సాధ్యం కాదని ఫిర్యాదులు ఉన్నాయి. దీనితో వాట్సాప్ కూడా దీనిపై ఫోకస్ చేసింది. వాట్సాప్ ప్రస్తుతం ఐఫోన్ కు మాత్రమే ఆ ఫీచర్ ను విడుదల చేసింది. ఆండ్రాయిడ్ యూజర్స్ కోసం త్వరలోనే మార్పులు చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఐఫోన్ లో వాట్సాప్ త్వరలో బ్రాడ్ కాస్ట్ ఫీచర్ తొలగించే అవకాశం ఉందని సమాచారం.