తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవో కారణంగా ఉద్యోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా మదనాపూర్ మండలం అజ్జ కొల్లు ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టార్ కృపయ్య మృతి చెందారు. గత కొంత కాలంగా ప్రభుత్వం తీసుకొచ్చిన జోవోపై ఆయన ఆందోళన చెందుతున్నారని.. ఆ భయంతోనే మృతి చెందారని సన్నిహితులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
జీతురాం నాయక్ అనే టీచర్ కూడా ఈ జీవో కారణంగా మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులు కుటుంబాలకు కోటి రూపాయలు పరిహారం చెల్లించాలని టీఎన్జీవో, టీజీఓ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. జీవోనెం.317 సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఈ అంశంలో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు యుద్ధం ప్రకటించాయి. ఈ రోజు రాత్రి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ జాగరణ దీక్ష చేస్తున్నారు.