ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ గ్రూపులో మరొకరు కరోనా బారిన పడ్డారు. ఇప్పటికే కోచ్ రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ సహా మొత్తం నలుగురు కరోనా పాజిటివ్ అని తేలగా వారంతా వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. నాలుగో టెస్టు జరుగుతున్న సమయంలోనే కరోనా అని తేలింది. అయితే, అప్పుడు ఆటగాళ్లు ఎవరికీ వైరస్ సోకలేదు.
తాజాగా, మాంచెస్టర్ లో ఐదో టెస్టుకు ముందు భారత ఫిజియో యోగేష్ కూడా కరోనా బారిన పడ్డారు. దీంతో భారత ఆటగాళ్లకు కూడా కరోనా టెస్టులు చేస్తున్నారు.
వరుసగా భారత బృందంలో ఒక్కొక్కరు వైరస్ బారిన పడుతున్న నేపథ్యంలో… ఐదో టెస్టు జరుగుతుందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఇప్పటికే నాలుగు టెస్టులు జరగ్గా భారత్ 2-1తేడాతో ముందంజలో ఉంది.