తెలంగాణ హైకోర్టు లాయర్లపై దాడులు ఆగటం లేదు. నేతలకు వ్యతిరేకంగా కేసులు దాఖలు చేస్తున్నారన్న భయంతో ఇప్పటికే లాయర్ దంపతులు వామనరావు, నాగమణిలను హత్య చేశారు. హత్య జరిగి నాలుగైదు రోజులు కూడా గడవకముందే యశ్వంత్ పూర్ వద్ద లాయర్ దుర్గాప్రసాద్ కారును వెంటాడి మరీ ఢీకొట్టించారు.
అడ్వకేట్ దుర్గాప్రసాద్ హైదరాబాద్ నుంచి హన్మకొండకు వస్తుండగా ఈ ఘటన జరిగింది. హైద్రాబాద్ జనగామ హైవే లో కార్ ను వెంబడించి యశ్వంతపూర్ వద్ద లారీ ఢీ కొట్టింది. 500 మీటర్ల దూరం కారును లాక్కెల్లి న లారీ డ్రైవర్ ను స్థానికులు డ్రైవర్ ను పట్టుకుని నిలదియగా బ్రేక్ ఫెయిల్ అందని చెప్పి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఓ కేసు కోసం లాయర్ దుర్గాప్రసాద్ హైదరాబాద్ నుండి వరంగల్ వెళ్తున్నారు.
భూములకు సంబంధించిన కేసు వ్యవహారమే ఇందులో ప్రధానంగా ఉందని తెలుస్తోంది.