బాలీవుడ్ సినీ నిర్మాతలంతా తెలుగుపై ఫోకస్ పెట్టినట్లున్నారు. ఓ సినిమా తర్వాత ఓ సినిమా రీమేక్ రైట్స్ ను తీసుకుంటున్నారు. ఇప్పటికే మిథునం, ఛత్రపతి, ఊసరవెల్లి లాంటి సినిమాల్ని రీమేక్ చేసేందుకు పోటీ పడి రైట్స్ దక్కించుకోగా, మరో హిట్ సినిమా కూడా బాలీవుడ్ కి వెళ్తోందని టాక్ వినిపిస్తుంది.
అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం `రేసుగుర్రం`. సురేందర్ రెడ్డి దర్శకుడు. అన్నాదమ్ముల అనుబంధానికి మంచి కమర్షియల్ పాయింట్స్ జోడించి , మాస్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా సినిమా ఉంటుంది. బన్నీ కెరీర్‌లో మంచి హిట్ మూవీ. చివర్లో కిల్ బిల్ పాండే గా బ్రహ్మానందం కామెడీ సినిమాకు ప్లస్ పాయింట్్.
ఇప్పుడు ఈ సినిమా బాలీవుడ్ కి వెళ్లనుంది. పెన్ స్టూడియోస్ సంస్థ `రేసుగుర్రం `హక్కుల్ని కొనుగోలు చేసింది. `ఛత్రపతి` సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేస్తోంది కూడా ఈ సంస్థనే. బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. నిజానికి.. రేసుగుర్రం, ఛత్రపతి ఈ రెండు రీమేకులూ బెల్లంకొండ ముందుకు వెళ్లాయట. అందులో ఛత్రపతి రీమేక్‌ని బెల్లంకొండ ఎంచుకున్నాడని తెలుస్తోంది.