ఇతర భాషల్లో హిట్ సినిమాలు తెలుగులో డబ్ అవుతుంటే… తెలుగు సినిమాలు హిందీలో రీమేక్ గా వెళ్తున్నాయి. ఇప్పటికే చత్రపతి సినిమా హిందీ రీమేక్ కు రెడీ కాగా, మరో తెలుగు సినిమా కూడా తెరపైకి వచ్చింది.
ఎన్టీఆర్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఊసరవెళ్లి సినిమా హిందీలో రాబోతుంది. ఇప్పటికే బెంగాలీలో హిట్ కాగా, హిందీలో రీమేక్ చేసేందుకు అక్షయ్ కుమార్ ముందుకొచ్చారు. కానీ అప్పట్లో డీల్ సెట్ కాకపోవటంతో వదిలేయగా… ఇన్ని సంవత్సరాల తర్వాత టిప్స్ ఫిల్మ్స్ సంస్థ రీమేక్ రైట్స్ ను తీసుకుంది.
అయితే, ఊసరవెళ్లిని ఎవరితో చేస్తారు, ఎప్పుడు చేస్తారు, డైరెక్టర్ ఎవరు అన్నది అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.